తిరువనంతపురం : మహిళా క్లయింట్లను లైంగిక వేధింపులకు గురిచేశాడనే ఆరోపణలపై ప్రముఖ టాటూ ఆర్టిస్ట్ సుజీష్ పీఎస్‌ను కేరళ పోలీసులు అరెస్ట్ చేశారు. సుజీష్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు ఆయనను ప్రశ్నించేందుకు చెరనల్లూర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తన ప్రైవేట్ భాగాల్లో టాటూ వేసే క్రమంలో సుజీష్ తనను లైంగిక వేధింపులకు గురిచేశాడని 18 ఏండ్ల బాలిక సోషల్ మీడియా పోస్ట్‌లో ఆరోపించడంతో ఈ వ్యవహారం బయటపడింది.
సుజీష్ తమ పట్ల కూడా అసభ్యంగా వ్యవహరించాడని మరో ఐదుగురు మహిళలు ఆరోపించారు. తనపై ఆరోపణలు వచ్చిన తర్వాత సుజీష్ పరారీలో ఉండగా కొచ్చి పోలీసులు అరెస్ట్ చేశారు. అడ్వకేట్‌ను కలిసే క్రమంలో శనివారం రాత్రి సుజీష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
సోషల్ మీడియాలో బాలిక పోస్ట్ వైరల్ అవడంతో గత కొన్నేండ్లుగా టాటూ ఆర్టిస్ట్ సుజీష్ తమ పట్ల అమర్యాదకరంగా వ్యవహరించిన తీరును సోషల్ మీడియాలో గుర్తుచేశారు. సుజీష్ స్టూడియోపై దాడి చేసిన పోలీసులు ల్యాప్‌టాప్‌లు, సీసీటీవీ విజువల్స్, ఇతర రికార్డులను సీజ్ చేశారు. సుజీష్‌పై ఫిర్యాదులు మూడు, నాలుగేండ్ల కిందటివని, అయితే తాము సాంకేతిక ఆధారాలను సేకరిస్తున్నామని పోలీసులు తెలిపారు.