suicide |అర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య

బంజారాహిల్స్ :అర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఎలుకల మందు గుళికలు మింగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జూబ్లీహిల్స్ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనంతరపురం జిల్లా నర్పల్ మంగలం బండ్లపల్లి గ్రామానికి చెందిన బి.ఫకీరయ్య(60) బతుకుదెరువుకోసం నగరానికి వచ్చి 15ఏండ్లుగా జూబ్లీహిల్స్ రోడ్ నెం 10 గాయత్రీహిల్స్‌లోని ఓ ప్లాట్ కు వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు.
గత కొంతకాలంగా అప్పులు పెరగడంతో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఫకీరయ్య పనిచేస్తున్న ప్లాట్‌లో అర్థరాత్రి దాటిన తర్వాత ఎలుకల మందు గుళికలు మింగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాసేపటికి స్థానికులు గుర్తించి ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు ప్రకటించారు. ఈ మేరకు మృతుడి భార్య ఈశ్వరమ్మ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Revanth Reddy | హైదరాబాద్ టు ఢిల్లీ వయా గోవా.. 80వ సారి సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ టూర్
దేవుడు దిగొచ్చినా నీళ్లు ఇవ్వలేం.. తాగునీళ్లు ఇస్తే గొప్ప.. సత్తుపల్లి సభలో మంత్రి తుమ్మల
Ponguleti Srinivas Reddy | నీళ్లు రావు.. కరెంట్ లేదు.. రైతులు రెండో పంట వేయొద్దు.. మంత్రి పొంగులేటి కీలక సూచన
Kodangal | సీఎం ఇలాకాలో నీటి కటకట.. కొడంగల్‌లో తాగునీటికి తిప్పలు.. ప్రజల అవస్థలు
Buldozers Demolition | అర్ధరాత్రి వేళ పేదల ఇండ్లపైకి బుల్డోజర్లు… 12 జేసీబీలతో 348 ఇండ్లు కూల్చివేత
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

