శనివారం 27 ఫిబ్రవరి 2021
Crime - Jan 19, 2021 , 20:03:26

బంగారు కమ్మలు కొనివ్వలేదని విద్యార్థిని ఆత్మహత్య

బంగారు కమ్మలు కొనివ్వలేదని విద్యార్థిని ఆత్మహత్య

కామారెడ్డి : బంగారు కమ్మలు కొనివ్వలేదని ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడ్డ విషాద సంఘటన  జిల్లాలోని సదాశివనగర్‌ మండలం అడ్లూర్‌ ఎల్లారెడ్డిలో చోటు చేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన కడారి బీరయ్య-బీరవ్వ దంపతులకు ముగ్గురు సంతానం. మూడో సంతానం అయిన పూజిత (15) అడ్లూర్‌ ఎల్లారెడ్డి ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నది. తన స్నేహితులందరికీ బంగారు కమ్మలు ఉన్నాయని, తనకు కూడా కొనివ్వాలని కొంతకాలంగా పూజిత తల్లిదండ్రులను కోరుతున్నది.

 ప్రస్తుతం డబ్బులకు ఇబ్బందిగా ఉందని.. తర్వాత కొనిస్తామని తల్లిదండ్రులు వాయిదా వేస్తున్నారు. దీంతో కలత చెందిన పూజిత సోమవారం సాయంత్రం ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పని నిమిత్తం కామారెడ్డికి వెళ్లిన తల్లిదండ్రులు రాత్రి ఇంటి చేరుకోగా అప్పటికే పూజిత మృతి చెంది ఉన్నది. మంగళవారం పూజిత తండ్రి బీరయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ నరేశ్‌ తెలిపారు.   

ఇవి కూడా చదవండి..

శభాష్‌ టీమిండియా : మంత్రి హరీశ్‌ రావు

వ్యవసాయ రంగాన్ని నాశనం చేసేలా కొత్త చట్టాలు : రాహుల్‌

సీఎం కేసీఆర్‌ను విమర్శిస్తే సహించేది లేదు : మంత్రి జగదీశ్ రెడ్డి 

అత్య‌ద్భుత సిరీస్ విజ‌యాల్లో ఇదీ ఒక‌టి: స‌చిన్‌ 

టీమిండియాకు 5 కోట్ల బోన‌స్

టీమిండియా విజ‌యంపై ప్ర‌ధాని మోదీ ప్ర‌శంస‌లు

రిష‌బ్ పంత్ సూప‌ర్ షో.. క్లాసిక్‌ ఇన్నింగ్స్‌

VIDEOS

logo