మంగళవారం 02 మార్చి 2021
Crime - Jan 23, 2021 , 18:17:10

గుడిప‌ల్లిలో దారుణం.. తల్లిని చంపిన త‌న‌యుడు

గుడిప‌ల్లిలో దారుణం.. తల్లిని చంపిన త‌న‌యుడు

నాగర్‌కర్నూల్ : జిల్లాలోని నాగ‌ర్‌క‌ర్నూల్ మండ‌ల పరిధిలో గ‌ల‌ గుడిపల్లి గ్రామంలో దారుణ సంఘ‌ట‌న చోటుచేసుకుంది. మద్యం మత్తులో తల్లిని కొడుకు క‌డ‌తేర్చాడు. నిందితుడు శుభాక‌ర్‌(22) కూలి ప‌నులు చేసుకుంటూ హైద‌రాబాద్‌లో జీవ‌నం సాగించేవాడు. లాక్‌డౌన్ స‌మ‌యంలో స్వ‌గ్రామానికి చేరుకున్న శుభాక‌ర్ మ‌ద్యానికి బానిస‌య్యాడు. రోజు త‌ల్లితో గొడ‌వ‌ప‌డేవాడు. తాజాగా మ‌ద్యం మ‌త్తులో త‌ల్లి ఇస్తార‌మ్మ త‌ల ప‌గ‌ల‌గొట్టి చంపాడు. 

VIDEOS

logo