బాలికపై ఆరుగురు బాలురు సామూహిక లైంగిక దాడి
పోలీసులు ఈ సంఘటనపై సీరియస్‌గా స్పందించారు. పోలీస్ బృందాలతో నిందితుల కోసం గాలించారు. బాలికపై సామూహిక లైంగిక దాడికి పాల్పడిన ఆరుగురు బాలురను అరెస్ట్ చేశారు.
గువాహతి: బాలికపై ఆరుగురు బాలురు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. అస్సాంలోని కరీంగంజ్ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. టీ గార్డెన్లో పని చేసే కుటుంబాలకు చెందిన ఆరుగురు బాలురు దారుణానికి పాల్పడ్డారు. రామకృష్ణ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాళీనగర్ ఏరియాలో 13 ఏళ్ల బాలికపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. బాధితురాలు ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు ఈ నెల 7న పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కాగా, పోలీసులు ఈ సంఘటనపై సీరియస్‌గా స్పందించారు. పోలీస్ బృందాలతో నిందితుల కోసం గాలించారు. బాలికపై సామూహిక లైంగిక దాడికి పాల్పడిన ఆరుగురు బాలురను అరెస్ట్ చేశారు. నిందితులంతా 13-15 ఏళ్ల వయసు వారని పోలీసులు తెలిపారు. పోక్సో చట్టంతోపాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితులు మైనర్లు కావడంతో బాల నేరస్తులుగా పరిగణించి సంబంధిత కోర్టు విధానాలు పాటిస్తామని పోలీసులు వెల్లడించారు. కాగా, ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
- Tags
- abuse
- Assam
- Girl
- Minor boys
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

