కొత్తూరు రూరల్ : రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన ఆదివారం కొత్తూరు మండల కేంద్రంలో చోటు చేసుకుంది. రైల్వే ఐఓ కానిస్టేబుల్ శ్రీనివాస్‌గౌడ్ తెలిపిన కథనం ప్రకారం.. ఆదివారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తి రైలు పట్టాలు దాటుతుండగా తిమ్మాపూర్ నుంచి షాద్‌నగర్ వైపు వెళ్తున్న రైలు గుర్తు తెలియని వ్యక్తి(35)ని ఢీకొట్టడంతో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. వ్యక్తి తెలుపురంగు షర్టు, బ్లూ కలర్ ప్యాంటును ధరించినట్లు తెలిపారు.
తిమ్మాపూర్ రైల్వేస్టేషన్ మాస్టర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం షాద్‌నగర్ కమ్యూనిటీ దవాఖానకు తరలించినట్లు ఐఓ శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు.