బెంగళూరు : కర్ణాటక రాజధాని బెంగళూరులోని కోరమంగళ మార్స్ వెల్ఫేర్ హాల్ వద్ద మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఓ కారు డివైడర్ను ఢీకొట్టడంతో దాంట్లో ప్రయాణిస్తున్న ఏడుగురు స్నేహితులు మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు. ఫ్రంట్ సీటులో ముగ్గురు, వెనుక సీటులో మిగతా నలుగురు కూర్చున్నట్లు పోలీసులు నిర్ధారించారు. మృతులంతా 20 నుంచి 30 ఏండ్ల లోపు వయసున్న వారే.. కరుణా సాగర్, బిందు (28), అక్షయ్ గోయల్, ఇషిత (21), ధనూష (21), రోహిత్, ఉత్సవ్ ఉన్నారు. కరుణా సాగర్, బిందు భార్యాభర్తలు. సెయింట్ జాన్స్ హాస్పిటల్లో మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించారు.
ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఎయిర్ బ్యాగ్ ఓపెన్ కాలేదని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఏడుగురిలో ఏ ఒక్కరూ కూడా సీటు బెల్ట్ ధరించలేదని నిర్ధారించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Seconds before the #Audi crashed in #Bengaluru’s Koramangala, (7 persons including a #DMK MLA’s son were #killed). CCTV footage 👇 of the car crashing through bollards on pavement and rebounding after hitting the wall. #ACCIDENT @NammaBengaluroo @WFRising @tinucherian pic.twitter.com/TzohilHKgj
— Rakesh Prakash (@rakeshprakash1) August 31, 2021