బెంగళూర్ : యలహంకలో 16 ఏండ్ల బాలికపై సామూహిక లైంగిక దాడికి పాల్పడి బ్లాక్మెయిల్ చేసిన కేసులో బెంగళూర్ పోలీసులు ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. యలహంకలో ఈ దారుణం వెలుగుచూడగా ఏప్రిల్ 5న పోలీసులకు ఫిర్యాదు అందింది. బాలిక 25 ఏండ్ల వ్యక్తిని ప్రేమిస్తుండగా అతడు బాధితురాలిని యలహంకలోని తన ఇంటికి తీసుకువెళ్లి లైంగిక వేధింపులకు గురిచేశాడు.
మొత్తం ఘటనను నిందితుడి స్నేహితుడు వీడియో తీశాడు. నిందితులు ఇద్దరూ ఈ వీడియోను తమ స్నేహితులకు షేర్ చేయగా వారు వీడియోను వైరల్ చేస్తామని బెదిరించి సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. బాలిక ఇంటికి వచ్చి ఏడుస్తూ కుటుంబసభ్యులకు తెలపడంతో ఈ విషయం వెలుగుచూసింది. ఈ కేసులో బాలిక ప్రియుడు ప్రధాన నిందితుడని, మరికొందరు నిందితులకూ ఈ ఘటనలో ప్రమేయం ఉందా అనే కోణంలో దర్యాప్తు సాగిస్తున్నామని పోలీసులు తెలిపారు.
వీడియోలు షేర్ చేసిన నిందితుల మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని, కంటెంట్‌ను మరికొందరికీ షేర్ చేశారా అనే విషయం తెలుసుకునేందుకు ఫోన్లను సైబర్ పోలీసులకు అందచేస్తామని చెప్పారు. పోక్సో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన యలహంక పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.