శంషాబాద్ రూరల్ : ఎయిర్పోర్టులో ప్రయాణికుడి నుంచి బంగారం స్వాధీనం చేసుకున్న సంఘటన ఆదివారం శంషాబాద్ ఎయిర్పోర్టులో జరిగింది. కస్టమ్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం జర్డా నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు వచ్చిన ప్రయాణికుడిపై అనుమానం వచ్చిన అధికారులు తనిఖీలు చేయగా అతడి వద్ద 248,74 గ్రాముల బంగారం లభించింది.
బంగారం విలువ 12లక్షలు ఉంటుందని, దాన్నిస్వాధీనం చేసుకున్నామని వివరించారు. ప్రయాణికుడు బంగారాన్ని బ్లాక్ కార్బన్ పేపర్లో పేస్ట్ రూపంలో తీసుకువస్తున్నాడు. బంగారం తీసుకువచ్చిన వ్యక్తితో పాటు బంగారం స్వాధీనం చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.