శంషాబాద్ : శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఓ ప్రయాణీకుని వద్ద అక్రమ విదేశీ కరెన్సీ ని కస్టమ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన మంగళవారం చోటుచేసుకుంది. కస్టమ్స్ వివరాల ప్రకారం … మహ్మద్ నజీర్ అనే ప్రయాణీకుడు ఎయిర్ అరేబియా విమానం టికెట్ బుక్ చేసుకొని షార్జా వెళ్లేందుకు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వచ్చాడు.
సీఐఎస్ఎఫ్ అధికారులకు అతని బ్యాగ్‌పై అనుమానం వచ్చింది. వెంటనే అతనిని అదుపులోకి తీసుకొని బ్యాగ్ తనిఖీ చేశారు. అందులో అక్రమంగా తరలిస్తున్న సౌది రియాల్స్ విదేశీ కరెన్సీ బయట పడింది. దీంతో అతనిని కస్టమ్స్ కు అప్పగించారు.
కస్టమ్స్ అధికారులు విదేశీ కరెన్సీ సీజ్ చేశారు. పట్టుబడిన కరెన్సీ రూ. 34.49 లక్షలు ఉంటుందని తెలిపారు. ఈ మేరకు నిందితునిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.