రూ.10.50 లక్షల విలువైన గంజాయి పట్టివేత

ఖమ్మం : కారులో తరలిస్తున్న రూ.10.50 లక్షల విలువైన గంజాయిని మంగళవారం ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండల పరిధిలోని కొక్కిరేణి వద్ద టాస్క్ఫోర్స్ పోలీసులు పక్కా సమాచారంతో పట్టుకున్నారు. తిరుమలాయపాలెం ఎస్ఐ రఘు తెలిపిన వివరాల ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం గురువాగు తండాకు చెందిన హళావత్ శివా, భూక్యా కిషన్, మహబూబాబాద్ జిల్లా తొర్రూరుకు చెందిన ప్రతాప్, ఒడిశాకు చెందిన పూర్ణా ఓ కారులో మంగళవారం తొర్రూరుకు గంజాయి తరలిస్తున్నారు.
సమాచారం అందుకున్న టాస్క్ఫోర్స్, తిరుమలాయపాలెం పోలీసులు కొక్కిరేణి వద్ద కారుని ఆపి తనిఖీలు చేపట్టారు. కారులో రూ.10.50 లక్షల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి పోలీసులు విచారరిస్తున్నారు. దాడిలో టాస్క్ఫోర్స్ ఎస్సై సతీఫ్, తిరుమలాయపాలెం ఏఎస్సై వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.