SBI | రివార్డ్ పాయింట్ల పేరుతో బ్యాంకు ఎలాంటి లింకులూ పంపదు: ఎస్బీఐ
రివార్డ్ పాయింట్ల పేరుతో బ్యాంకు ఎలాంటి లింకులూ పంపదని స్టేట్ బ్యాంక్ ఇండియా (SBI) వెల్లడించింది. ఏపీకే ఫైల్స్ డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పదని.. ఎస్ఎంఎస్, వాట్సాప్‌లో వచ్చే లింకులను క్లిక్ చేయవచ్చని వినియోగదారులకు సూచించింది.
హైదరాబాద్: రివార్డ్ పాయింట్ల పేరుతో బ్యాంకు ఎలాంటి లింకులూ పంపదని స్టేట్ బ్యాంక్ ఇండియా (SBI) వెల్లడించింది. ఏపీకే ఫైల్స్ డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పదని.. ఎస్ఎంఎస్, వాట్సాప్‌లో వచ్చే లింకులను క్లిక్ చేయవచ్చని వినియోగదారులకు సూచించింది. సైబర్ నేరగాల పట్ల ఖాతాదారులు అప్రమత్తంగా ఉండాలని కోరింది.
రివార్డు పాయింట్ల పేరుతో ఎస్బీఐ ఖాతాదారులే లక్ష్యంగా సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. ఎస్బీఐ పేరుతో వాట్సాప్‌లో రివార్డ్స్ లింకు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ‘మీ ఎస్బీఐ రివార్డ్ రూ.7250 యాక్టివేట్ అయింది. అది ఈ రోజు ముగిసిపోతుంది. డబ్బులు పొందేందుకు ఎస్బీఐ రివార్డ్స్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. తద్వారా మీ ఖాతాలో డబ్బులు జమ చేసుకోండి’ అంటూ మెసేజ్‌ను షేర్ చేస్తున్నారు. ఎస్బీఐ యోనో పేరుతో ఓ లింక్‌ను కూడా దానికి జత చేస్తున్నారు. అయితే తెలిసిన నంబర్ల నుంచే ఈ మెసేజ్ వస్తుండటంతో దాన్ని చూసినవారు నిజమని నమ్మి క్లిక్ చేస్తున్నారు. ఇదే అదనుగా సైబర్ నేరగాళ్లు వారి అకౌంట్లను ఖాళీచేస్తున్నారు. ఈ నేపథ్యంలో రివార్డు పాయింట్ల పేరుతో బ్యాంకు ఎలాంటి మెసేజ్‌లు ఇవ్వదంటూ ఎస్బీఐ స్పష్టం చేసింది.


Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

