మంగళవారం 27 అక్టోబర్ 2020
Crime - Sep 18, 2020 , 14:06:15

అటవీశాఖ అధికారులపై కర్రలతో దాడి.. సర్పంచ్‌ అరెస్టు

అటవీశాఖ అధికారులపై కర్రలతో దాడి.. సర్పంచ్‌ అరెస్టు

గురుగ్రామ్‌ : మహేందర్‌ గర్‌ జిల్లాలో అటవీ అధికారులపై దాడి చేసిన సర్పంచ్‌తోపాటు పలువురు వ్యక్తులను పో్లీసులు అరెస్టు చేశారు. గురువారం ఆరావలి ప్రాంతంలో ఆక్రమణకు గురైన అటవీ ప్రాంతాన్ని పరిశీలించేందుకు ఫారెస్టు రేంజ్‌ అధికారి రజినీష్‌కుమార్‌, డిప్యూటీ రేంజర్‌ చంద్రగుప్త వెళ్లారు. ఆక్రమణలు తొలగించాలని సూచించగా కల్బా గ్రామ సర్పంచ్‌ సత్యేందర్‌తోపాటు పలువురు వ్యక్తులు వీరిపై కర్రలతో విచక్షణారహితంగా దాడి చేశారు.

ఈ దాడిలో ఇద్దరు అటవీశాఖ అధికారులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం హాస్పటల్‌లో వీరు చికిత్స పొందుతున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రధాన నిందితుడు సతేంద్రపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కేసులో మరికొంత మందిని త్వరలో అరెస్టు చేస్తామని నాగల్‌ చౌదరి పోలీసు స్టేషన్‌ అధికారి తెలిపారు. అటవీ శాఖ అధికారులపై స్వయానా ఓ ప్రజాప్రతినిధే దాడి చేయడంతో ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo