హైదరాబాద్ : మలక్‌పేట ప్రధాన రహదారిలోని మెట్రో పిల్లర్‌ను ఓ ఆర్టీసీ బస్సు అదుపుతప్పి ఢీకొట్టింది. ఈ ప్రమాదం బుధవారం ఉదయం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో బస్సు, ఆటో డ్రైవర్లతో పాటు మరో ఇద్దరు మహిళలకు స్వల్ప గాయాలయ్యాయి.
అయితే ముందున్న ఆటోను తప్పించేందుకు ఆర్టీసీ డ్రైవర్ యత్నించాడు. ఈ క్రమంలో అదుపుతప్పిన బస్సు.. మెట్రో పిల్లర్‌ను ఢీకొట్టింది. బస్సు దిల్సుఖ్నగర్ నుంచి పటాన్ చెరు వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆర్టీసీ బస్సు, మెట్రో పిల్లర్ పాక్షికంగా ధ్వంసమైంది.