హైదరాబాద్ : నగరంలోని చాదర్ఘాట్ బ్రిడ్జిపై సోమవారం రాత్రి ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. యూసుఫ్, సిరాజ్ బాను అనే ఇద్దరు దంపతులు ద్విచక్ర వాహనంపై చంచల్గూడ నుంచి టోలీచౌకి వెళ్తుండగా.. వారిని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సిరాజ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, యూసుఫ్ తీవ్రంగా గాయపడ్డాడు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. సిరాజ్ డెడ్ బాడీని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.