అమరావతి: తూర్పుగోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. జిల్లాలోని ఎదురులంక-యానాం గౌతమి
వంతెనపై జరిగిన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందడం ఆ కుటుంబంలో
విషాదం నింపింది. కాకినాడకు ద్విచక్రవాహనంపై వెళ్తున్న వారిని వ్యాన్ ఢీ కొట్టడంతో దంపతులు, వారి
కుమారుడు దుర్మరణం చెందారు.
ఈ ప్రమాదంలో ఇద్దరు కుమార్తెలకు తీవ్రగాయాలు కావడంతో స్థానికులు ఆస్పత్రికి తరలించారు . సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వ్యాన్ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా చికిత్స పొందుతూ కుమార్తె హర్షిత(3) కూడా మృతి చెందింది.