అమరావతి : అనంతపురం జిల్లా ఎన్.ఎస్ గేట్ జాతీయ రహదారిపై శనివారం జరిగిన రోడ్డుప్రమాదంలో తెలంగాణలోని వనపర్తి జిల్లాకు చెందిన దంపతులు దుర్మరణం పాలయ్యారు. వనపర్తికి చెందిన శంకరమ్మ, ఈశ్వర స్వామి కుటుంబ సభ్యులు హిందూపురానికి కారులో వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. అనంతపురం జిల్లా ఎన్ఎస్ గేట్ జాతీయ రహదారిపై ఇనుప లారీని ఓవర్ టేక్ చేయబోయి అదే లారీని ఢీ కొన్నారు.
ఈ సంఘటనలో వనపర్తికి చెందిన ఆరుగురు తీవ్రంగా గాయపడగా శంకరమ్మ, ఈశ్వరస్వామి అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడ్డ వెంకటేశ్, సోమ్లనాయక్, రాజు, సీతమ్మలను అనంతపురం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. పోలీసులు సంఘటన స్థలానికి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.