మంగళవారం 02 జూన్ 2020
Crime - Feb 16, 2020 , 12:49:03

తల్లి అంత్యక్రియలకు వెళ్తూ రిటైర్డ్‌ సీఐ దంపతులు మృతి

తల్లి అంత్యక్రియలకు వెళ్తూ రిటైర్డ్‌ సీఐ దంపతులు మృతి

వరంగల్‌ అర్బన్‌ : ఆదిలాబాద్‌ టీచర్స్‌ కాలనీలో తీవ్ర విషాద సంఘటన చోటుచేసుకుంది. తల్లి అంత్యక్రియలకు వెళ్తూ రిటైర్డ్‌ సీఐ, ఆయన భార్య మృతిచెందారు. వరంగల్‌ అర్బన్‌ జిల్లాలోని ఎల్కతుర్తి మండలం శాంతినగర్‌ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఈ ఘటన చోటుచేసుకుంది. రిటైర్డ్‌ సీఐ విజయ్‌కుమార్‌ తల్లి రమణబాయి వృద్ధాప్య అనారోగ్యంతో నిన్న హైదరాబాద్‌లో కన్నుమూసింది. ఆదిలాబాద్‌లో నేడు అంత్యక్రియలు. ఈ అంత్యక్రియలకు హాజరయ్యేందుకు విజయ్‌కుమార్‌.. భార్య, కుమార్తెతో కలిసి కారులో బయల్దేరారు. కాగా శాంతినగర్‌ వద్ద వీరు ప్రయాణిస్తున్న కారును లారీ ఢీకొట్టడంతో సంఘటనా స్థలంలోనే దంపతులిద్దరూ మృతిచెందారు.  కారు డ్రైవర్, కుమార్తె తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను హుజూరాబాద్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.


logo