కష్టాల్లో ఆదుకోవాల్సిన బంధువే ఆమె పాలిట యముడయ్యాడు. అందరికీ ఆమె మంత్రగత్తె అని చెప్పి కొట్టి చంపేశాడు. ఈ ఘటన రాంచీలో వెలుగు చూసింది. సీమా దేవీ అనే 31 ఏళ్ల యువతిని జార్ఖండ్ రాజధాని రాంచీలో చంపేశారు. బసో దేవి అనే 35 ఏళ్ల మహిళ కూడా స్థానికంగా నివశిస్తోంది.
సీమాకు ఆమె బంధువు. శనివారం నాడు సీమ ఒక మంత్రగత్తె అని చెప్పి ఐరన్ రాడ్డుతో కొట్టి చంపేసింది బసో దేవి. విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి బసోదేవిని అదుపులోకి తీసుకున్నారు. వీళ్లిద్దరి మధ్య ఏవో ఆస్తి తగాదాలు ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు.