ఖానాపురం: కూలీలతో వెళ్తున్న టాటాఏసీ వాహనాన్ని లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదం ఖానాపురం మండలకేంద్రంలో శనివారం జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..మండలంలోని వేపచెట్టుతండాకు చెందిన భానోత్ శ్రీను తన టాటా ఏసీ వాహనంలో ఖానాపురానికి చెందిన 15 మంది వ్యవసాయ కూలీలను పొలం పనులు చేసేందుకు తీసుకెళుతున్నాడు. ఈ క్రమంలో అతను మండల పరిషత్‌కు వెళ్లే దారి నుంచి జాతీయ రహదారి రోడ్డు మీదకు వస్తుండగా నర్సంపేట వైపు నుంచి మహబుబాబాద్‌కు ఎర్రమట్టి లోడ్‌తో వెళుతున్న లారీ ఢీ కొట్టింది.
దీంతో ఆటో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన స్థానికులు వెంటనే క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం నర్సంపేటకు తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని లారీ, టాటాఏసీ వాహనాన్ని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.