శనివారం 19 సెప్టెంబర్ 2020
Crime - Jul 21, 2020 , 21:56:26

మానవుల అక్రమ రవాణాను ఛేదించిన రాచకొండ పోలీసులు

మానవుల అక్రమ రవాణాను ఛేదించిన రాచకొండ పోలీసులు

హైదరాబాద్: రాచకొండ పోలీస్ స్పెషల్ ఆపరేషన్స్ బృందం ఒక అంతర్రాష్ట్ర ఆన్‌లైన్ మానవ అక్రమ రవాణా రాకెట్‌ను ఛేదించింది. సోమవారం రాత్రి నేరెడ్‌మెట్ వద్ద ఇద్దరు మహిళలను రక్షించడమే కాకుండా నిర్వాహకుడొకరిని అరెస్టు చేశారు.

అరెస్టు చేసిన నిందితుడు దిల్‌సుఖ్‌నగర్ నివాసి ఏ శివకుమార్ కాగా.. ప్రధాన నిర్వాహకుడు చిన్నాగా గుర్తించారు. చిన్నాపరారీలో ఉన్నాడు. రక్షించిన ఇద్దరు మహిళలు పశ్చిమ బెంగాల్‌కు చెందినవారుగా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిన్న, శివ కుమార్ పశ్చిమ బెంగాల్, మహారాష్ట్రలలోని మానవ అక్రమ రవాణాదారులతో సంప్రదింపులు జరిపి ఉద్యోగాలు ఇప్పిస్తామనే ముసుగులో ఆరు నెలల పాటు కాంట్రాక్ట్ ప్రాతిపదికన యువతులను కొనుగోలు చేసి తీసుకొస్తారు. వారిని హైదరాబాద్‌ తీసుకొచ్చి వ్యభిచారం చేయాల్సిందిగా బలవంతం చేస్తారు. ఇందుకోసం వారు మంచి కాలనీలను ఎంచుకుంటారు. మహిళల ఫొటోలను సోషల్ మీడియాలో అప్‌లోడ్‌ చేసి ఆన్‌లైన్‌లో వినియోగదారులను ఆకర్శిస్తారు. డబ్బు లావాదేవీలను కూడా ఆన్‌లైన్‌లోనే జరుపుతారు. పోలీసులకు చిక్కకుండా ఫోన్‌ ద్వారా వ్యాపారాలు జరుపుతుంటారని, పక్కా సమచారంతో దాడి జరిపి ఇద్దరు మహిళలను రక్షించామని, ఒకరిని అరెస్ట్ చేశామని రాచకొండ కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌ చెప్పారు.


logo