హైదరాబాద్: ఆన్లైన్లో కార్లను కిరాయికి తీసుకుని విక్రయిస్తున్న అంతర్ రాష్ట్ర దొంగల ముఠాను రాచకొండ పోలీసులు (Rachakonda police) అరెస్టు చేశారు. జూయ్ యాప్ ద్వారా కార్లు అద్దెకు తీసుకుని పక్క రాష్ట్రంలో అమ్ముతున్న మగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులను రాచకొండ సీపీ మహేష్ భగవత్ మీడియా ముందు హాజరుపరిచారు. నకిలీ ధృవపత్రాలతో కార్లను అద్దెకు తీసుకుంటున్నారని చెప్పారు. జూమ్ కార్ యాప్ ద్వారా కారును కిరాకి తీసుకుని మళ్లీ తిరిగి రాకపోవడంతో.. నిర్వాహకులు గత అక్టోబర్‌లో చైతన్యపూరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారని వెల్లడించారు. దీంతో సీసీటీవీ కెమెరాల ఆధారంగా కేసు దర్యాప్తు చేశామన్నారు.
కార్లకు జీపీఎస్ తొలగించి ఇతర రాష్ట్రాలకు తీసుకెళ్తున్నారని, అనంతరం అక్కడి అమ్ముతున్నారని చెప్పారు. ఈ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన గుడ్డటి మహేష్ నూతన్ కుమార్ కీలక నిందితడి తెలిపారు. తెలంగాణతోపాటు ముంబై, భువనేశ్వర్, చైన్నై, పుణెలో కార్లు గుర్తించామన్నారు.
ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ పూర్తిచేసిన నూతన్ కుమార్‌ను మొబైల్ దొంగతనం కేసులో 2016లో అరెస్టయ్యాడని తెలిపారు. అతనిపై ఇప్పటివరకు 22 కేసులు నమోదయ్యాయని చెప్పారు. కార్లను కిరాయికి ఇచ్చేవారు టెక్నాలజీని పెంపొందించుకోవాలని సూచించారు. నిందితుల నుంచి ఐదు కార్లు, ఒక బైకు స్వాధీనం చేసుకున్నామన్నారు.