లక్నో : ఉత్తరప్రదేశక్షలని జలౌన్‌లో ఘోరం జరిగింది. ఓ వ్యక్తితో పాటు అతని భార్య(8 నెలల గర్భిణి)పై దుండగులు విచక్షణారహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. దాడికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
వివరాల్లోకి వెళ్తే.. సందీప్, ఉపాసన దంపతులు జలౌన్‌లో నివాసముంటున్నారు. అయితే వారి ఇంట్లో ఉంటున్న ఓ వ్యక్తి కోసం ముగ్గురు దుండుగులు వచ్చారు. మీ అంకుల్ ఎక్కడ అంటూ సందీప్, ఉపాసనను ఆ దుండగులు ప్రశ్నించారు. తమకు తెలియదని చెప్పడంతో.. ఆ ముగ్గురు కలిసి సందీప్, గర్భిణిపై విచక్షణారహితంగా దాడి చేశారు.
ఈ దాడి ఘటనను స్థానికులు తమ కెమెరాల్లో బంధించి, సోషల్ మీడియాలో వైరల్ చేశారు. బాధితుడు సందీప్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితులు రవీంద్ర, మన్మోహన్, ఆయన కుమారుడు ఆదేశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.