శుక్రవారం 22 జనవరి 2021
Crime - Jan 12, 2021 , 22:00:32

రేషన్‌ బియ్యం అక్రమ తరలింపును అడ్డుకున్న పోలీసులు

రేషన్‌ బియ్యం అక్రమ తరలింపును అడ్డుకున్న పోలీసులు

ఖమ్మం :  లారీలో అక్రమంగా తరలిస్తున్న 180 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని ఖమ్మం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు స్వాధీనం చేకున్నారు. రేషన్‌ బియ్యం అక్రమంగా తరలిస్తునారని టాస్క్‌ఫోర్స్ పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. ఈ మేరకు ఏసీపీ వెంకట్రావు ఆధ్వర్యంలో టాస్క్‌ఫోర్స్ సీఐ వెంకటస్వామి, ఎస్‌ఐ సతీశ్‌ కుమార్ సిబ్బందితో బోనకల్లు మండలం పాలడుగు గ్రామం వద్ద  వాహన తనిఖీలు చేపట్టారు. కాకినాడ వైపు వెళ్తున్న ఓ లారీలో (ఏపీ 16 టీవై 5163) రేషన్‌ బియ్యం బస్తాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.

బియ్యం విలువ రూ.5 లక్షల 40 వేల విలువ ఉంటుందని టాస్క్‌ఫోర్స్‌ ఏసీపీ తెలిపారు. కోదాడకు చెందిన మీరా అనే వ్యక్తి రేషన్ బియ్యాన్ని కోదాడ నుంచి కాకినాడకు అక్రమంగా రవాణా చేస్తున్నట్లు విచారణ వెల్లడైనట్లు పేర్కొన్నారు. లారీని సీజ్‌ చేసి బోనకల్ పోలీసు స్టేషన్‌లో అప్పగించారు. తనిఖీల్లో కానిస్టేబుల్ రవి, శ్రీనివాస్, ఉపేందర్, రామకృష్ణ పాల్గొన్నారు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo