నలుగురు దోపిడీ దొంగలపై పీడీ యాక్ట్
క్రైం న్యూస్ | వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రాత్రి వేళల్లో ఒంటరిగా వెళ్లే వాహనాలను అడ్డగించి వాహనదారుల నుంచి డబ్బు, ఇతర వస్తువులను దోచుకోనే దారిదోపిడీలకు పాల్పడిన నలుగురు దోపిడీ దొంగలపై వరంగల్ పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి శుక్రవారం పీడీ యాక్ట్ ఉత్తర్వులను జారీచేశారు.

వరంగల్ అర్బన్ : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రాత్రి వేళల్లో ఒంటరిగా వెళ్లే వాహనాలను అడ్డగించి వాహనదారుల నుంచి డబ్బు, ఇతర వస్తువులను దోచుకోనే దారిదోపిడీలకు పాల్పడిన నలుగురు దోపిడీ దొంగలపై వరంగల్ పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి శుక్రవారం పీడీ యాక్ట్ ఉత్తర్వులను జారీచేశారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని దారిదోపిడీలకు పాల్పడుతున్న కరీమాబాద్, బీరన్నకుంటకు చెందిన ఎం.డి. ఫిరోజ్, షేక్ రఫీక్, షేక్ గఫూర్, మట్వాడాకు చెందిన కస్తూరి సురేష్ పై వరంగల్ పోలీస్ కమిషనర్ పీడీ యాక్ట్ ఉత్తర్వులను జారీచేశారు.
సీపీ ఉత్తర్వులను ఇంతేజా గంజ్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు వరంగల్ కేంద్రకారాగారంలో ఉన్న నిందితులకు జైలు అధికారుల సమక్షంలో పీడీ యాక్ట్ ఉత్తర్వులను అందజేసారు.
పీడీ యాక్ట్ ఉత్తర్వులు అందుకున్న నిందితులు నలుగురు గత నెల 12వ తేదీన రాత్రి వేళలో వంగపహాడ్-దామెర సమీపాన ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఒక వ్యక్తిని అడ్డగించి పదివేలు ఇవ్వమని డిమాండ్ చేసారు.
డబ్బు ఇవ్వకపోవడంతో నిందితులు బాధితుడిని కత్తితో బెదిరించి నాలుగు వేల రూపాయలను దోచుకున్నారు. అదే రోజు నిందితులు మరో బాధితుడి వద్ద నాలుగు వందల రూపాయలను దోచుకున్న సంఘటనలో ఫిరోజ్, షేక్ రఫీక్, షేక్ గఫూర్లను హసన్‌పర్తి పోలీసులు అరెస్టు చేయగా.. కస్తూరి సురేష్ ను ఇంతేజార్ గంజ్ పోలీసులు అరెస్టు చేసిన జైలు తరిలించారు. చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఇవి కూడా చదవండి..
ట్రాక్టర్ బోల్తా..మహిళ మృతి, 15 మందికి గాయాలు
వ్యాక్సినేషన్ సెంటర్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే అరూరి
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

