ముంబై : గత మూడు రోజులుగా చత్రపతి శివాజీ మహరాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం (సీఎస్ఐ)లో ఎయిర్పోర్్ అధికారులు పలువురు నిందితులను పట్టుకుని వారి వద్ద నుంచి 8 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకూ పది స్మగ్లింగ్ కేసులు నమోదయ్యాయని అధికారులు వెల్లడించారు.
స్వాధీనం చేసుకున్న బంగారు ఆభరణాల్లో గాజులు, నెక్లెస్‌లు, బ్రాస్లెట్లతో పాటు సీల్డ్ ప్యాకెట్లలో దాచిన బంగారాన్ని సీజ్ చేశారు. నిందితులను ప్రశ్నించడంతో పాటు పలు కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేశామని పోలీసులు తెలిపారు. భారీ మొత్తంలో బంగారం పట్టుబడటంతో గోల్డ్ స్మగ్లింగ్‌పై నిఘా తీవ్రతరం చేశారు.