అహ్మదాబాద్ : వావి వరసలు మరిచి కామాంధులు రెచ్చిపోతున్నారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో 67 ఏండ్ల వృద్ధురాలిని లైంగిక వేధింపులకు గురిచేస్తూ ఆమె ఎదుట హస్తప్రయోగానికి తెగబడిన ప్రబుద్ధుడి ఉదంతం వెలుగుచూసింది. నిందితుడి ఆగడాలు ఎంతటికీ ఆగకపోవడంతో విసిగిన బాధితురాలు పోలీసులకు పిర్యాదు చేయడంతో ఈ దారుణం బయటపడింది.
నగరంలోని వెజాల్పూర్ ప్రాంతంలో నివసించే వృద్ధురాలు 12 ఏండ్ల కిందట భర్త చనిపోవడంతో ఒంటరిగా ఉంటోంది. కొంతకాలంగా ఆమె ఇంటి ఎదుట నివసించే నిందితుడు రమేష్ పంచల్ (55) తరచూ బాధితురాలిని వెంబడించి వేధిస్తున్నాడు. తాను ఇంటి బయట ఉన్న సమయంలో అతడు అసభ్యంగా సైగలు చేయడంతో పాటు దుస్తులు తొలగించి ప్రైవేట్ భాగాలు చూపుతున్నాడని వృద్ధురాలు ఫిర్యాదులో వాపోయింది.
కొన్నిసార్లు తన ఎదుట హస్తప్రయోగం చేస్తున్నాడని తెలిపింది. కొంతకాలంగా ఆమెను వేధిస్తున్నా పట్టించుకోని బాధితురాలు ఇటీవల అతడు అసభ్య సైగలు చేయడంతో పాటు దుస్తులు లేకుండా వెకిలి చేష్టలకు పాల్పడటంతో షీ టీం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.