న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా ఆన్లైన్ స్కామ్‌లు (Cyber Fraud) పెరిగిపోవడం ఆందోళన రేకెత్తిస్తోంది. ప్రజలను మోసగించి భారీ మొత్తాల్లో దండకునేందుకు స్కామర్లు రోజుకో స్కామ్‌తో రెచ్చిపోతున్నారు. వీరు కేవలం భారతీయులనే కాకుండా విదేశాల్లో భారత సంతతికి చెందిన ప్రజలనూ టార్గెట్ చేస్తున్నారు. లేటెస్ట్ కేసులో స్కామర్లు బ్రిటన్‌లో నివసించే ఎన్ఆర్ఐని రూ. 57 లక్షలకు మోసగించారు. బ్యాంక్‌లో తన ఫోన్ నెంబర్‌ను అప్డేట్ చేయకపోవడంతో తన సిమ్ డిస్కనెక్ట్ అయిన ఉదంతంలో ఆయన ఇంత పెద్దమొత్తంలో సొమ్ము పోగొట్టకున్నాడు.
ఈ స్కామ్‌కు సంబధించి లూధియానా పోలీసులు నలుగురు వ్యక్తులను ఇటీవల అరెస్ట్ చేశారు. ఆ ప్రాంతంలోని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రిలేషిన్షిప్ మేనేజర్ సుఖ్జీత్సింగ్, బిహార్‌కు చెందిన లవ్ కుమార్, యూపీలోని ఘజపూర్‌కు చెందిన నిలేష్ కుమార్ పాండేను అరెస్ట్ చేశారు. వీరంతా రమణ్‌దీప్ ఎం గ్రేవల్ అనే ఎన్ఆర్ఐను టార్గెట్ చేశారు. ఇక స్కామర్లు రమణ్‌దీప్ డిస్కనెక్టెడ్ పాత ఫోన్ నెంబర్ వాడుతూ అతడి ఖాతాలోని రూ. 57 లక్షలను దారిమళ్లించారు. బాధితులను మోసగించే క్రమంలో ముందుగా వారు టార్గెట్ చేసే ప్రజల బ్యాంకు ఖాతా వివరాలను రాబడతారు.
వీరి పరిశోధనలో భాగంగా గ్రేవల్ బ్యాంక్ ఖాతా వివరాలను సేకరించారు. గ్రేవల్ మొబైల్ నెంబర్ తొలుత బ్యాంక్ ఖాతాకు లింక్ చేయగా ఆపై డిస్కనెక్ట్ అయిందని స్కామర్లు తెలుసుకున్నారు. గ్రేవల్ పాత నెంబర్‌ను వేరొకరి కేటాయించగా ఆ వ్యక్తిని సంప్రదించిన స్కామర్లు ఆ నెంబర్‌ను తీసుకున్నారు. దీంతో ఆ ఫోన్ నెంబర్ ద్వారా స్కామర్లు ఎన్ఆర్ఐ కస్టమర్ నెట్ బ్యాంకింగ్‌ను హ్యాక్ చేసి ఈమెయిల్ అడ్రస్‌ను మార్చడంతో పాటు బెనిఫిషీయర్లను యాడ్ చేసి నెట్ బ్యాంకింగ్ ద్వారా న్యూ డెబిట్ కార్డును ఆర్డర్ చేశారు. ఆపై ఎన్ఆర్ఐ ఖాతా నుంచి స్కామర్లకు చెందిన మూడు బ్యాంకు ఖాతాలకు నిధులను మళ్లించారు.
Read More :