Suicide | ఉన్నత చదువులకు డబ్బులు లేక..తనువు చాలించి..

బంజారాహిల్స్ : ఉన్నత చదువుల కోసం కావాల్సిన డబ్బులు తల్లి ఇవ్వకపోవడంతో ఆత్మహత్యాయత్నం చేసిన యువతి చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
బంజారాహిల్స్ రోడ్ నెం 10లోని నూర్‌నగర్‌లో నివాసం ఉంటున్న కే.దివ్యశ్రీ (19) నగరంలోని ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ చదువుతోంది. నెలరోజుల క్రితం తాను పీజీ చేయాలనుకుంటున్నానని, రూ.60వేలు కావాలంటూ తల్లి ధనలక్ష్మిని కోరింది. అయితే ఇడ్లీలు అమ్ముకుని జీవిస్తున్న తనవద్ద రూ.60వేలు లేవని తల్లి చెప్పింది.
దీంతో మనస్థాపానికి గురైన దివ్య గత నెల 31న ఆల్ అవుట్ లిక్విడ్ తాగింది. దీంతో తీవ్ర అస్వస్థతకు గురయిన దివ్యశ్రీని కుటుంబ సభ్యులు బేగంపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. అప్పటినుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న దివ్యశ్రీని మెరుగైన చికిత్సకోసం నిమ్స్ ఆస్పత్రికి తరలించగా శనివారం మృతి చెందింది.
ఈ మేరకు తల్లి ధనలక్ష్మి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
Horoscope | 11-10-2026 ఆదివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

