హైదరాబాద్ : నగరంలోని కూకట్పల్లి ప్రాంతంలో దారుణం జరిగింది. ప్రేమించి పెళ్లి చేసుకొని, నెల రోజులు గడవక ముందే నవ దంపతులు ఆత్మహత్య (Newlyweds Suicide ) చేసుకున్న ఘటన కాలనీలో విషాదం నింపింది. ప్రేమించి, పెద్దలను ఒప్పించి మార్చి 8న కూకట్ పల్లిలో కార్తీక్ ( Karthik ), మంజుల ( Manjula ) అనే ఇద్దరు వివాహం చేసుకున్నారు.
నెల రోజులు గడవక ముందే నవ దంపతుల ఆత్మహత్య ఉరేసుకొని ఒకరు, విషం తీసుకొని మరొకరు బలవన్మరణం చెందారు. అయితే వీరి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.