Online Scam : గత ఏడాదిగా దేశవ్యాప్తంగా ఆన్లైన్ స్కామ్‌లు విపరీతంగా పెరుగుతున్నాయి. రోజుకో తరహా స్కామ్‌తో సైబర్ నేరగాళ్లు చెలరేగుతూ ఆన్లైన్ వేదికగా అమాయకులను అడ్డంగా దోచేస్తున్నారు. మరోవైపు ఆన్లైన్లో రొమాన్స్ స్కామ్‌లూ వెలుగుచూస్తున్నాయి. బాధితులతో నేరగాళ్లు పరిచయం పెంచుకుని ప్రేమ నటిస్తూ ఆపై భారీ స్కెచ్ వేసి అందినకాడికి దండుకుంటున్నారు.
ఇక ఈ తరహా స్కామ్ ముంబైలో ఇటీవల వెలుగుచూసింది. నగరానికి చెందిన 53 ఏండ్ల డాక్టర్‌ను లింక్డిన్ వేదికగా ఓ వ్యక్తి పరిచయం చేసుకుని రూ. 28 లక్షలు మోసం చేశాడు. తాను ఐర్లాండ్‌కు చెందిన సర్జికల్ ఆంకాలజిస్ట్, ప్లాస్టిక్ సర్జన్ జోస్ ఫెర్నాండెజ్‌గా నిందితుడు ముంబై డాక్టర్‌ను నమ్మబలికాడు. ఆపై ఇద్దరూ వాట్సాప్‌లో తరచూ చాట్ చేస్తుండేవారు.
ఈ క్రమంలో ఓరోజు తాను ఢిల్లీ ఇంటర్నేషనల్ విమానాశ్రయంలో చిక్కుకున్నానని, రూ. 8 లక్షల విదేశీ కరెన్సీ ఉన్నందుకు కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారని బాధితురాలికి తెలిపాడు. కస్టమ్స్ చార్జీలు చెల్లిస్తే వదిలివేస్తారని మభ్యపెట్టాడు. స్కామర్‌తో పాటు అతడితో ఉన్న వ్యక్తి సూచనలకు అనుగుణంగా బాధితురాలు వారు చెప్పిన వివిధ బ్యాంకు ఖాతాలకు రూ. 28 లక్షలు ట్రాన్స్ఫర్ చేశారు. ఇక వేర్వేరు కారణాలతో డబ్బు పంపాలని స్కామర్ ఒత్తిడి చేయడంతో మోసపోయానని గ్రహించిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
Read More :
CM Revanth Reddy | 16న కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం..