కోల్కతా : పశ్చిమ బెంగాల్లోని నదియా జిల్లాలో దారుణం వెలుగుచూసింది. బర్త్డే పార్టీకి వెళ్లిన బాలికపై లైంగిక దాడి జరిగింది. నిందితుల వేధింపులతో గాయపడిన బాలిక ఆదివారం మరణించింది. ఈ ఘటనలో ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
బాలికపై లైంగిక దాడి ఘటనకు సంబంధించి కలకత్తా హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. స్ధానిక టీఎంసీ నేత కుమారుడు ఈ ఘటనలో ప్రధాన నిందితుడు కాగా నేత ప్రోద్భలంతో పోస్ట్మార్టం నిర్వహించకుండానే బాలిక మృతదేహానికి అంత్యక్రియలు జరిపించారని బాలిక కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
మరోవైపు ఈ ఘటన రాజకీయ రంగు పులుముకుంది. బాధితురాలికి న్యాయం జరిపించాలని కోరుతూ విపక్షాలు 12 గంటల బంద్కు పిలుపు ఇచ్చాయి. ఈ ఘటనపై పిల్ దాఖలు చేసేందుకు కలకత్తా హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి ప్రకాష్ శ్రీవాస్తవ అనుమతించారు.