న్యూఢిల్లీ : దళిత బాలికను కిడ్నాప్ చేసి ఇద్దరు వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడిన ఘటన గ్రేటర్ నోయిడాలో కలకలం రేపింది. నిందితులు ఈ దారుణాన్ని ఫోన్లో రికార్డు చేసి ఇంటర్నెట్లో పోస్ట్ చేస్తామని బాలికను బెదిరించారు. అంతటితో ఆగని నిందితులు బాధితురాలిని కులం పేరుతో దూషిస్తూ ఆమెతో బలవంతంగా విషం తాగించారు.
బాలిక గర్భం దాల్చడంతో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని కూడా నిందితులు బాలికను బెదిరించారు. బాలిక కుటుంబసభ్యుల ఫిర్యాదు ఆధారంగా నిందితులపై ఎస్సీ,ఎస్టీ అత్యాచార నిరోధకచట్టం, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితులను అరెస్ట్ చేశారు.