Viral Video | ఓ ద్విచక్ర వాహనదారుడు రోడ్డుపై వేగంగా వెళ్తూ.. రాంగ్రూట్లో వెళ్లాడు. ఆ బైకర్ రోడ్డును క్రాస్ చేస్తుండగా.. అదే మార్గంలో ఓ భారీ ట్రక్కు వేగంగా దూసుకొచ్చింది. ట్రక్కును బైక్ ఢీకొట్టబోయింది. అప్రమత్తమైన ట్రక్కు డ్రైవర్.. బైకర్‌ను తప్పించేందుకు తన వాహనాన్ని పక్కకు తిప్పాడు. బ్యాలెన్స్ మిస్ అవడంతో.. ఆ ట్రక్కు రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదం నుంచి బైకర్ ప్రాణాలతో బయటపడ్డాడు. కనీసం కింద కూడా పడలేదు ద్విచక్ర వాహనదారుడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ వీడియోను ఐపీఎస్ ఆఫీసర్ దీపాన్షు కబ్రా తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. తగినంత వేగంతో వెళ్తే ప్రమాదాలు జరగనే జరగవు. మీతో పాటు ఇతరులు కూడా సురక్షితంగా ఉంటారని ఆయన ఆ వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు.
ऐसी गति राखिये, दुर्घटना कभी ना होय,
औरन भी सुरक्षित रहै, आपौ सुरक्षित होय. pic.twitter.com/Gvy6B96EdD— Dipanshu Kabra (@ipskabra) January 5, 2023