ముంబై : ఓ వృద్ధుడు బస్సు కింద పడిపోయాడు. కానీ డ్రైవర్ చూసుకోలేదు. బస్సును అలానే ముందుకు పోనిచ్చాడు. అయితే వృద్ధుడు బస్సు కింద పడటాన్ని గమనించిన ఇతర వాహనదారులు గట్టిగా కేకలు వేసి బస్సును ఆపారు. బస్సు కింద పడ్డ వృద్ధుడు చనిపోయాడా? బతికాడా? అని స్థానికులు ఊపిరి బిగబట్టి చూశారు. అదృష్టవశాత్తు ఆ వృద్ధుడు ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
మంగళవారం మధ్యాహ్నం 2:38 గంటల సమయంలో ఓ వృద్ధుడు ముంబైలోని పోవాయి ఏరియాలో రోడ్డు దాటేందుకు ప్రయత్నించాడు. వాహనాల రద్దీ ఎక్కువగా ఉండటంతో ఆయన రోడ్డు క్రాస్ చేసేందుకు వెనుక ముందు అయ్యాడు. అయితే ఓ బస్సు ముందు నుంచి రోడ్డు దాటేందుకు యత్నించాడు వృద్ధుడు. ఆయనను బస్సు డ్రైవర్ గమనించకుండా ముందుకు పోనిచ్చాడు. దీంతో ముసలాయన బస్సు కింద పడిపోయాడు. ఈ ఘటనను ఇతర వాహనదారులు గమనించి, బస్సు డ్రైవర్ను అప్రమత్తం చేశారు. బస్సు కొంచెం ముందుకు వెళ్లి ఆగింది. వృద్ధుడు చనిపోయాడా? బతికాడా? అని అందరూ ఊపిరి బిగబట్టి చూశారు. మొత్తానికి వృద్ధుడు ప్రాణాలతో బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు ఎలాంటి కేసు నమోదు చేయలేదు.
#WATCH | Elderly man’s close shave in Powai area of Mumbai. The incident was captured on a CCTV camera.
(Source: viral video) pic.twitter.com/50LV4N2Pvk
— ANI (@ANI) December 15, 2022