న్యూఢిల్లీ : సైబర్ నేరగాళ్లు ఆన్లైన్ వేదికగా చెలరేగుతూ రోజుకో తరహా స్కామ్‌తో (online scam) అమాయకుల నుంచి అడ్డంగా దోచేస్తున్నారు. లేటెస్ట్గా గుజరాత్‌కు చెందిన ఓ వ్యక్తిని సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సర్ జాబ్ పేరుతో స్కామర్లు ఏకంగా రూ. 12 లక్షలకు బురిడీ కొట్టించారు. వదోదర వాసి 36 ఏండ్ల ప్రకాష్ సావంత్‌కు ఈ ఏడాది మార్చిలో దివ్య అనే మహిళ నుంచి వాట్సాప్ మెసేజ్ వచ్చింది.
సెలబ్రిటీల సోషల్ మీడియా ఖాతాల్లో వారి ఫొటోలను లైక్ చేయడం, ఖాతాలకు సబ్‌స్క్రైబ్ చేయడం ద్వారా పెద్ద మొత్తం ఆర్జించవచ్చని బాధితుడిని ఆమె నమ్మబలికింది. ఆపై సావంత్‌ను ఆమె వివిధ గ్రూప్‌ల్లో యాడ్ చేసి గ్రూప్ చాట్స్‌లో యాక్టివ్ చేసింది. అతడి నమ్మకాని చూరగొనేందుకు తొలుత పలు టాస్క్‌లకు గాను సావంత్‌కు చిన్నపాటి మొత్తాలను రిటన్స్గా చూపింది. లక్కీ అనే మరో మహిళ అతడికి పరిచయమై మరికొన్ని గ్రూపుల్లో యాడ్ చేసింది.
ప్రీపెయిడ్ టాస్క్‌లకు మంచి కమిషన్ వస్తుందని మభ్యపెట్టిన లక్కీ తొలుత పలు టాస్క్‌లకు గాను అతడు రూ. 10,000 ఇన్వెస్ట్ చేయగా రూ. 12,350 క్యాష్‌బ్యాక్‌గా అందించింది. ఆపై కమిషన్ మరింత పెరగడంతో బాధితుడు పెద్దమొత్తంలో ఇన్వెస్ట్ చేశాడు. సావంత్ మొత్తం రూ. 11.27 లక్షలు ఇన్వెస్ట్ చేసి తనకు అప్పగించిన టాస్క్‌లు పూర్తి చేశాడు. ఆపై రూ. 45 లక్షలు సంపాదించేందుకు రూ. 11.80 లక్షలు ఇన్వెస్ట్ చేయాలని స్కామర్లు కోరగా తన వద్ద అంత పెద్దమొత్తం లేదని సమాధానం ఇచ్చాడు. దీంతో గతంలో సావంత్ ఇన్వెస్ట్ చేసిన రూ. 11.27 లక్షలను రిటన్ చేసేందుకు స్కామర్లు నిరాకరించారు. మోసపోయానని గ్రహించిన సావంత్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Read More :