Haryana violence: హర్యానాలో 50 పంచాయతీల కీలక నిర్ణయం.. ముస్లిం వ్యాపారుల ప్రవేశంపై నిషేధం
Haryana violence | హర్యానాలోని 50 పంచాయతీలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ముస్లిం వ్యాపారుల ప్రవేశంపై నిషేధం విధించాయి. అలాగే గ్రామాల్లో నివసించే ముస్లింలు వారి పత్రాలను పోలీసులకు సమర్పించాలని పేర్కొన్నాయి. ఈ మేరకు సర్పంచులు సంతకం చేసిన లేఖలను విడుదల చేశారు.
చండీగఢ్: హర్యానాలోని 50 పంచాయతీలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ముస్లిం వ్యాపారుల ప్రవేశంపై నిషేధం విధించాయి. ఈ మేరకు సర్పంచులు సంతకం చేసిన లేఖలను విడుదల చేశారు. హర్యానాలోని నూహ్ జిల్లాలో ఇటీవల మతపరమైన ఘర్షణలు జరిగాయి (Haryana violence). ఇద్దరు హోంగార్డులతో సహా ఆరుగురు మరణించగా పలువురు గాయపడ్డారు. హింసాత్మక సంఘటనల నేపథ్యంలో నూహ్ జిల్లాకు పొరుగున్న ఉన్న రేవారి, మహేందర్‌గఢ్, ఝజ్జర్ జిల్లాలకు చెందిన 50 పంచాయతీలు ఒకే విధమైన లేఖలు విడుదల చేశాయి. ముస్లిం వ్యాపారులను గ్రామాల్లోకి నిషేధించారు. అలాగే గ్రామాల్లో నివసించే ముస్లింలు వారి పత్రాలను పోలీసులకు సమర్పించాలని ఆ లేఖల్లో పేర్కొన్నారు.

Village Letter
మరోవైపు, హిస్సార్ జిల్లాకు చెందిన కొంతమంది పంచాయతీ సభ్యులు కూడా ఇలాంటి డిమాండ్లు చేశారు. ముస్లిం ఉద్యోగులను తొలగించాలంటూ అన్ని షాపులకు రెండు రోజులు గడువు ఇచ్చారు. అలా చేయని షాపులు, వ్యక్తులను తాము బహిష్కరిస్తామని హెచ్చరించారు. ప్రభుత్వ ఉన్నతాధికారులు దీనిపై స్పందించారు. ముస్లిం వ్యాపారుల ప్రవేశాన్ని నిషేధిస్తూ లేఖలు జారీ చేసిన పంచాయతీలకు షోకాజ్ నోటీసులు పంపాలని బ్లాక్ కార్యాలయాలను నార్నాల్ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ ఆదేశించారు.
కాగా, బీజేపీ పాలిత హర్యానాలోని నూహ్ జిల్లాలో ఇటీవల మతపరమైన ఘర్షణలు చెలరేగాయి. గురుగ్రామ్, ఫరీదాబాద్, పల్వాల్, రేవారి, పానిపట్, భివానీ వంటి ప్రాంతాలకు ఇవి వ్యాపించాయి. ఈ హింసాత్మక సంఘటనలకు సంబంధించి 142 కేసులు నమోదయ్యాయి. అల్లర్లకు సంబంధించి పోలీసులు 312 మందిని అరెస్ట్ చేశారు. 106 మందిని అదుపులోకి తీసుకున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

