హైదరాబాద్ : నిజామాబాద్ జిల్లాలో కిడ్నాప్ ఘటన కలకలం సృష్టించింది. పాలిటెక్నిక్ గ్రౌండ్ వద్ద ఈ ఘటన చోటు చేసుకున్నది. ఓ వ్యక్తిని చితకబాదిన దుండగులు కారులో ఎక్కించుకొని వెళ్లిపోయారు. టీఎస్29సీ 6688 నంబరు గల కారులో వ్యక్తి ముగ్గురు వ్యక్తులు కలిసి కిడ్నాప్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ జరుపుతున్నారు. సీసీ టీవీ ఫుటేజీల సహాయంతో నిందితులను గుర్తించే పనిలో పడ్డారు. సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అపహరణకు గురైన వ్యక్తి వివరాలు తెలియరాలేదు. సదరు వ్యక్తిని ఎందుకు కిడ్నాప్ చేశారు ? ముగ్గురు యువకులు ఎవరు ? ఏవైనా తగాదాలున్నాయా? అనే కోణంలో పోలీసులు వివరాలు ఆరా తీస్తున్నారు. ఇదిలా ఉండగా.. కారు రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా పోలీసులు వివరాలు ఆరా తీయగా.. కారు నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం తిరుగల్లికి చెందిన బాగయ్య అనే వ్యక్తి పేరిట ఉన్నట్లు గుర్తించారు.