ముంబై: రాంగ్ రూట్లో వస్తున్న కారును ఆపేందుకు ప్రయత్నించిన ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్‌ను ఒక వ్యక్తి బానెట్‌పై సుమారు అర కిలోమీటరు దూరం లాక్కెళ్లాడు. దీంతో హత్యాయత్నం కింద కేసు నమోదు చేసిన పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ సంఘటన జరిగింది. ఖర్ఘర్ సెక్టార్ 10లో నివాసం ఉంటున్న 28 ఏళ్ల ఆకాష్ జంగీద్ వృత్తిరిత్యా ఇంజినీర్. కోప్రా వంతెన రోడ్డుపై కారు డ్రైవ్ చేస్తున్న అతడు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి రాంగ్ రూట్లో కారు నడిపాడు.
గమనించిన ఖార్ఘర్ ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్ నామ్‌దేవ్ గడేకర్, కారును ఆపేందుకు ప్రయత్నించాడు. అయితే ఆకాష్ తన కారును ఆపలేదు. ట్రాఫిక్ పోలీస్ గడేకర్ మీదుగా దూసుకెళ్లగా ఆయన వెంటనే కారు బానెట్‌ను పట్టుకుని దానిపై ప్రమాదకరంగా వేలాడారు. అయినప్పటికీ కారు ఆపని ఆకాష్, సుమారు 500 మీటర్ల వరకు అలాగే నడిపాడు.
మరోవైపు పక్కనే ఉన్న మరో ట్రాఫిక్ పోలీస్ వెంటనే అప్రమత్తమయ్యాడు. ఒకరి బైక్‌పై ఎక్కి ఆ కారును వెంబడించాడు. చివరకు ఆ కారును అడ్డుకుని ఆకాష్‌ను అదుపులోకి తీసుకున్నారు. హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి అతడ్ని అరెస్ట్ చేశారు. కాగా, ఆ కారు వెనుక ఉన్న మరో కారులోని కెమేరాలో రికార్డు అయిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
In Kharghar, Navi Mumbai, a car driver first broke the traffic rules, then started running away after dodging the policemen. And when the policeman came in front of his car, he stabbed him. After that, instead of stopping the car, pic.twitter.com/DaHeFD1Ayi
— BHARAT GHANDAT (@BHARATGHANDAT2) July 9, 2022