
టోక్యో: ప్రయాణికులతో నిండి ఉన్న రైలుబోగీ ఒక్కసారిగా అరుపులు కేకలతో దద్దరిల్లిపోయింది. కొందరు ప్రయాణికులు పక్క బోగీల్లోకి పరుగులు తీస్తే, మరికొందరు రైలు ఆగీ ఆగగానే కిటికీల్లో నుంచి బయటకు దూకడం ప్రారంభించారు. ఇదంతా జపాన్ రాజధాని టోక్యోలో జరిగిన ఘటన.
ఇక్కడ అత్యంత బిజీగా ఉండే కేయో లైన్లో షింజుకు వెళ్తున్న రైల్లో ఇది జరిగింది. దీనంతటికీ కారణం ఒక వ్యక్తి. ‘బ్యాట్‌మ్యాన్’ సినిమాలో ఉండే జోకర్లా వేషం వేసుకున్న అతను రైల్లో కనిపించిన ప్రయాణిలపై కత్తితో దాడి చేయడం ప్రారంభించాడు. చివరగా పెట్రోలు పోసి రైల్లో నిప్పుపెట్టారు.
దీనికి సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. దానిలో ప్రయాణికులు భయంతో పరుగులు తీస్తుండగా వెనక పేలుడు జరిగినట్లు కనిపిస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
京王線火災で逃げる人々 pic.twitter.com/ZfN1pD0C2V
— しずくβ (@siz33) October 31, 2021
Scary train incident in Tokyo. I believe it’s on the Keio line. I hope everyone is ok. It’s 9 p.m. on Sunday night. Hope the train wasn’t too busy. pic.twitter.com/4i9ADp5PVV
— 🌾Food Sake Tokyo🍙 (@YukariSakamoto) October 31, 2021