సంగారెడ్డి : కుటుంబ కలహాలతో వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. సదాశివపేట మండల పరిధిలోని ఆత్మకూర్ గ్రామంలో వడ్డె యాదయ్య(42) బుధారం అర్ధరాత్రి దారుణ హత్యకు గురయ్యాడు. సదాశివపేట ఎస్ఐ అంబారియా తెలిపిన వివరాల ప్రకారం.. ఆత్మకూర్ గ్రామానికి చెందిన వడ్డె యాదయ్య, ఆంజనేయులు వరుసకు అన్నదమ్ములు.
మంగళవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఇద్దరు గొడవ పడ్డారు. తిరిగి సాయంత్రం గొడవ జరిగింది. అయితే మృతుడు యాదయ్యను అర్ధరాత్రి ఆంజనేయులు, అతని భార్య మంగ, బావమరిది రాజు కలిసి దారుణంగా నరికి చంపినట్లు ఎస్ఐ తెలిపారు.
యాదయ్య బాబాయి జంగయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. యాదయ్యను హత్య చేసిన తరువాత నిందితులు పరారీలో ఉన్నారని, వారిని త్వరలోనే అరెస్టు చేస్తామన్నారు.