కోల్కతా : రూ 5 కోట్ల విలువైన 81 గోల్డ్ బిస్కెట్లను స్మగ్లింగ్ చేస్తున్న వ్యక్తి సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) సిబ్బంది అరెస్ట్ చేసిన ఘటన సోమవారం బెంగాల్లోని నదియాలో వెలుగుచూసింది. నిందితుడు ఉత్తర 24 పరగణాలకు చెందిన నజీం మండల్ బంగ్లదేశ్ నుంచి భారత్కు 9.7 కిలోల విలువైన గోల్డ్ బిస్కెట్లను తరలిస్తూ పట్టుబడ్డాడు.
అంతర్జాతీయ బోర్డర్ వద్ద తనకు రూ 5.02 కోట్ల విలువైన గోల్డ్ బిస్కెట్లను బంగ్లాదేశీ తనకు అందించాడని దర్యాప్తులో అతడు వెల్లడించాడు. బంగారంతో నిందితుడు తన గ్రామానికి వెళుతుండగా బీఎస్ఎఫ్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. గోల్డ్ బిస్కెట్లతో పాటు నిందితుడిని బాగ్ధా కస్టమ్స్ కార్యాలయానికి అప్పగించారు. కాగా, ఇది వరుసగా నాలుగు రోజుల్లో వెలుగుచూసిన మూడవ గోల్డ్ స్మగ్లింగ్ ఘటన కావడం గమనార్హం.