Crime News | ఢిల్లీ మెట్రో స్టేషన్లో మహిళ ఎదుట అసభ్య ప్రవర్తన.. నిందితుడి అరెస్ట్..!
Crime News | ఢిల్లీలోని ఒక మెట్రో రైల్వే స్టేషన్ వద్ద ప్లాట్ ఫామ్ పై ఉన్న మహిళ ముందు అశ్లీల హవభావాలు ప్రదర్శించిన యువకుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు.
Crime News | ఢిల్లీలోని ఓ మెట్రో రైల్వే స్టేషన్లో ఒక మహిళ ముంగిట అశ్లీల హవభావాలు ప్రదర్శించిన 23 ఏండ్ల యువకుడ్ని అరెస్ట్ చేశామని ఢిల్లీ పోలీసులు గురువారం తెలిపారు. నిందితుడి పేరు శివం శర్మ అని.. అతడు బీ ఫార్మసీ పూర్తి చేసి, ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీలో మార్కెటింగ్ విభాగంలో పని చేస్తున్నాడని పోలీసులు తెలిపారు.
మెట్రో రైలులో తుగ్లకాబాద్ మెట్రో స్టేషన్ నుంచి మండీ హౌస్ మెట్రో స్టేషన్కు చేరుకున్న ఓ మహిళ.. ఫ్లాట్ ఫామ్ నంబర్-1 వద్ద తన స్నేహితురాలి కోసం వేచి చూస్తున్నారు. ఎదురుగా ఉన్న ప్లాట్ ఫామ్ వద్ద సదరు నిందితుడు అశ్లీల హవభావాలు ప్రదర్శిస్తున్న సంగతి గమనించి మహిళ.. సీఐఎస్ఎఫ్ అధికారికి ఫిర్యాదు చేసింది.
మహిళ ఫిర్యాదుపై స్పందించిన సీఐఎస్ఎఫ్ సిబ్బంది ఎదురు ప్లాట్ ఫామ్ పైకి వస్తుండగానే నిందితుడు మెట్రో రైలు ఎక్కి పారిపోయాడు. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా నిందితుడ్ని బాధితురాలు గుర్తించింది. నిందితుడి ఫొటోలు డెవలప్ చేశారు.. సదరు వ్యక్తి నంగ్లీ మెట్రో స్టేషన్ వద్ద రైలు దిగి వెళ్లి పోయాడని తేల్చుకున్నారు.
బేగంపూర్లోని రాజీవ్ నగర్ లో ఆ వ్యక్తి నివాసం ఉంటున్నాడని తెలుసుకున్నామని డీసీపీ (మెట్రో) జీ రాం గోపాల్ నాయక్ తెలిపారు. అడ్రస్ తెలుసుకుని అతడ్ని అరెస్ట్ చేశామని తెలిపారు. మెట్రో రైళ్లలో ప్రయాణిస్తున్న వ్యక్తులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్సీ) అధికార ప్రతినిధి తెలిపారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
President Murmu | మహిళలకు మరింత సాధికారత కల్పించేందుకు కృషి చేయాలి : రాష్ట్రపతి ముర్ము
Supreme Court | సీఈసీ జ్ఞానేష్ కుమార్కు సుప్రీంకోర్టు నోటీసులు.. జంతర్ మంతర్పై ఢిల్లీ ప్రభుత్వానికి నోటీసులు
Kalpavruksha Vahanam | కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి దర్శనం..తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు
Lover | ప్రియుడికి బెయిల్ ఇప్పించేందుకు ప్రియురాలు ఏం చేసిందో తెలుసా..?
Jailer 2 Review | ‘జైలర్ 2’ మూవీ రివ్యూ.. రజనీ మార్క్ యాక్షన్ ఎలా ఉందంటే!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

