లక్నో : మానవ సంబంధాలు రోజురోజుకీ దిగజారుతున్నాయి. తాగిన మైకంలో నిద్రిస్తున్న కన్నకూతురిపైనే లైంగిక దాడికి ప్రయత్నించిన ప్రబుద్ధుడిని పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన యూపీలో వెలుగుచూసింది. లఖీంపూర్ ఖేరి జిల్లాలోని మైగల్గంజ్ ప్రాంతంలో సోమవారం ఈ దారుణం జరిగింది. బాధితురాలికి ఇటీవలే వివాహం కాగా మైగల్గంజ్లోని కన్నవారింటికి వచ్చిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తాగిన మైకంలో ఇంటికి వచ్చిన తండ్రి నిద్రిస్తున్న కూతురిని అభ్యంతరకరంగా తాకి లైంగిక దాడికి ప్రయత్నించాడు. బాధితురాలు తండ్రిని వారించి తల్లితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. గతంలోనూ తండ్రి తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని ఫిర్యాదులో పేర్కొంది. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.