ఏటీఎం బూత్‌లో మహిళా లాయర్‌కు ముద్దులు.. ఆపై లూటీకి పాల్పడి అడ్డంగా బుక్కయ్యాడు!

ముంబై : ఏటీఎం బూత్‌లో మహిళా లాయర్‌ను లైంగికంగా వేధించి ఆమె వద్ద డబ్బు గుంజుకున్న వ్యక్తి ఉదంతం ముంబైలోని నలసపారలో బుధవారం వెలుగుచూసింది. ఈ ఘటనకు సంబంధించి నిందితుడు అవినాష్ కసర్ (29)ను అంధేరి పోలీసులు అరెస్ట్ చేశారు. అంధేరి, నలసపార మధ్య రైల్వే స్టేషన్లలో సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించిన పోలీసులు నేరం జరిగిన 24 గంటల్లోనే నిందితుడిని అరెస్ట్ చేశారు.
అంధేరి రైల్వేస్టేషన్ వెలుపల ఏటీఎం బూత్‌లో జనవరి 19 రాత్రి 8.40 గంటలకు ఈ ఘటన జరిగింది. ఏటీఎం నుంచి బాధితురాలు నగదు విత్‌డ్రా చేస్తుండగా నిందితుడు ఏటీఎం బూత్‌లోకి ప్రవేశించి మహిళను ముద్దుపెట్టుకుని ఆపై ఆమె వద్దనుంచి నగదు గుంజుకుని పరారయ్యాడు. ఈ ఘటనతో షాక్‌కు గురైన మహిళ పోలీస్‌స్టేషన్‌లో నిందితుడిపై ఫిర్యాదు చేశారు.
సీసీటీవీ ఫుటేజ్‌తో పాటు సాంకేతిక ఆధారాలతో నిందితుడు హార్బర్ లైన్ మీదుగా గోరెగావ్ వెళ్లే రైలు ఎక్కినట్టు గుర్తించారు. కసర్ ఫోన్ నెంబర్‌ను సేకరించిన పోలీసులు కాల్ డిటైల్స్‌ను చెక్ చేయడంతో పాటు సెల్‌ఫోన్ లొకేషన్ ఆధారంగా అతడిని పట్టుకున్నారు. సీసీటీవీ ఫుటేజ్, కసర్ ప్రొఫైల్ బాధితురాలు ఇచ్చిన సమాచారం సరిపోలడంతో గురువారం రాత్రి నిందితుడిని అరెస్ట్ చేశారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

