Fire Accident | మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ అధికార నివాసానికి శనివారం సాయంత్రం సమీపంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సెక్రటేరియట్ కాంప్లెక్స్ సమీపాన నిరుపయోగంగా ఉన్న ఓ భవనంలో ఈ అగ్ని ప్రమాద సమాచారం అందుకున్న అగ్ని మాపక దళ సిబ్బంది మూడు ఫైరింజన్లతో శ్రమించి మంటలు అదుపు చేశారు. ఈ ఘటనతో పరిసర ప్రాంతాల్లో పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు.
ఈ అగ్నిప్రమాదం వల్ల సీఎం నివాసానికి ఎటువంటి నష్టం వాటిల్లలేదని అధికారులు చెప్పారు. ప్రమాద కారణాలపై పోలీసు అధికారులు విచారణ చేపట్టారు. అగ్ని ప్రమాదానికి గురైన భవనం.. గోవా మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టీ కిప్జెన్ కుటుంబ సభ్యులకు చెందిందని పోలీసులు గుర్తించారు. గతేడాది మణిపూర్లో అల్లర్లు ప్రారంభమైనప్పటి నుంచి ఈ భవనం ఖాళీగా ఉందని చెప్పారు.