Live-in Relation | లివ్-ఇన్ రిలేషన్ షిప్లో ఉన్న వ్యక్తికి నిద్రమాత్రలిచ్చి.. నిప్పుపెట్టిన యువతి!
Live-in Relation | వాళ్లిద్దరు లివ్-ఇన్ రిలేషన్లో ఉన్నారు. ఇలా చాలా కాలంగా ఉంటున్నారు. అయితే ఏమైందో ఏమో ఒకరోజు ఆ యువతి షాకింగ్ నిర్ణయం తీసుకుంది.

చండీగఢ్: వాళ్లిద్దరు లివ్-ఇన్ రిలేషన్లో ఉన్నారు. ఇలా చాలా కాలంగా ఉంటున్నారు. అయితే ఏమైందో ఏమో ఒకరోజు ఆ యువతి షాకింగ్ నిర్ణయం తీసుకుంది. తన భాగస్వామిని చంపేయాలని నిర్ణయించుకుంది. దీనికోసం ఇంట్లో అతనికి నిద్రమాత్రలు తినిపించింది. అవి తీసుకోవడంతో స్పృహతప్పిన అతన్ని ఆటోలో ఎక్కించుకొని ఊరిబయటకు వెళ్లింది.
అక్కడ ఒక నిర్జన ప్రదేశంలో అతన్ని కిందపడేసి పెట్రోలుపోసి తగలబెట్టింది. ఈ ఘటన హర్యానాలోని ఫరీదాబాద్‌లో వెలుగు చూసింది. 2019లో వీళ్లిద్దరికీ పరిచయం అయిందని పోలీసులు తెలిపారు. ఇటీవలి కాలంలో ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయని, అయితే ఈ హత్యకు కారణాలేంటనే అంశంపై దర్యాప్తు చేస్తున్నామని వారు వివరించారు. ఈ ఘటన అక్టోబరు 16న జరిగినట్లు వెల్లడించారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

