చలాన్ విధించారని ఏకంగా పోలీస్ స్టేషన్‌కే కరెంట్ కట్ చేసిన లైన్మాన్
లక్నో: విద్యుత్ లైన్మాన్కు పోలీసులు చలాన్ విధించారు. దీనిపై ఆగ్రహించిన అతడు ఏకంగా పోలీస్ స్టేషన్‌కు విద్యుత్ సరఫరా నిలిపివేశాడు. ఉత్తర ప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. విద్యుత్ లైన్మాన్ భగవాన్ స్వరూప్, శనివారం హర్దాస్పూర్లో బైక్‌పై వెళ్తుండగా మోడీ సింగ్ అనే పోలీస్ అధికారి అడ్డుకున్నాడు. బైక్ రిజిస్ట్రేషన్ పత్రాలు చూపించమని అడిగాడు. అయితే బైక్ పత్రాలు తన ఇంటి వద్ద ఉన్నాయని, వెంటనే వెళ్లి తీసుకొచ్చి చూపిస్తానని అతడు చెప్పాడు. వినిపించుకోని ఆ పోలీస్ అధికారి రూ.500 జరిమానా విధించాడు.
మరోవైపు ఈ సంఘటనపై విద్యుత్ లైన్మాన్ భగవాన్ స్వరూప్ ఆగ్రహం చెందాడు. తనకు చలాన్ విధించిన ఆ పోలీస్ అధికారిపై రివేంజ్ తీసుకోవాలని నిర్ణయించాడు. తన సహచరులతో కలిసి ఆ పోలీస్ అధికారి విధులు నిర్వహించే హర్దాస్పూర్ పోలీస్ స్టేషన్‌కు విద్యుత్ సరఫరాను నిలిపివేశాడు.
కాగా, తన చర్యను విద్యుత్ లైన్మాన్ భగవాన్ స్వరూప్ సమర్థించుకున్నాడు. ఆ పోలీస్ స్టేషన్‌కు విద్యుత్ మీటర్ లేదని, అక్రమంగా విద్యుత్‌ను వినియోగించుకుంటున్నారని అతడు ఆరోపించాడు. ఈ మేరకు మీడియాకు వెల్లడించాడు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

