జోగులాంబ గద్వాల : కర్ణాటకలోని రాయిచూర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. ఐజ మండలం మిట్టదొడ్డి స్టేజ్ వద్ద ఆర్టీసీ బస్సు స్టీరింగ్ విరిగిపోయింది. దీంతో బస్సు అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో.. బస్సులోని ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదు. దీంతో అటు పోలీసులు, ఇటు కర్ణాటక ఆర్టీసీ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.