యైటింక్లయిన్ కాలనీ, సెప్టెంబర్ 4: సింగరేణి సంస్థ అభివృద్ధిలో సూపర్వైజర్ల పాత్ర కీలకమని ఓసీపీ-3 మేనేజర్ డీ రమేశ్ అన్నారు. ఉత్తమ సూపర్వైజర్గా ఎంపికై స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో సంస్థ సీఎండీ నడిమెట్ల శ్రీధర్‌తో సన్మానం పొందిన హెడ్ ఓవర్‌మన్ మాదాసు రామ్మూర్తిని ఆదివారం ఓసీపీ-3 ప్రాజెక్టులో తోటి ఉద్యోగులు సన్మానించారు. ఈ సందర్భంగా మేనేజర్ మాట్లాడారు. నిబద్ధతతో సంస్థ వృద్ధి కోసం క్రమశిక్షణగా పని చేసే ప్రతి ఉద్యోగికి గుర్తింపు వస్తుందనే దానికి నిదర్శనం రామ్మూర్తి అని వివరించారు.
ప్రాజెక్టులో పని చేస్తున్న ఒక ఉద్యోగి ఉత్తమ సూపర్వైజర్గా ఎంపికవడం మిగతా వారికి స్ఫూర్తిదాయకమన్నారు. సింగరేణిలో పని చేస్తున్న సూపర్వైజర్లు ఉద్యోగులు, ఉన్నతాధికారులకు మధ్య వారధిగా ఉండి రక్షణతో కూడిన ఉత్పత్తి తీయడం ఎంతో కీలకమని గుర్తు చేశారు. ఇదే స్ఫూర్తితో ప్రతి ఉద్యోగి మరింత బాధ్యతతో పని చేయాలని కోరారు.
కార్యక్రమంలో చల్లా రవీందర్, ఆర్ రమేశ్, భరత్ కుమార్, ఎం శ్రీనివాస్, కత్రేషన్, నవీన్‌కుమార్, ఆర్ పాపయ్య, బేతి చంద్రయ్య, ఆకుల రాజయ్య, బీ శ్రీనివాస్, మల్లారెడ్డి, మొగిలి, శ్రీనివాస్‌రెడ్డి, సిరికొండ శ్రీకాంత్, బండ కృష్ణ, వెంకటేశ్వర్‌రెడ్డి, వెంకటస్వామి, ఘని, భీమయ్య, మాధవరావు, బీ వెంకటేశ్వర్లు, ఉస్మాన్‌బేగ్ పాల్గొన్నారు.